జడ్జిల ఆస్తులు ప్రజలకు తెలిసేలా.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

55చూసినవారు
జడ్జిల ఆస్తులు ప్రజలకు తెలిసేలా.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
అలహాబాద్ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ ఇంట్లో ఇటీవల భారీగా నోట్ల కట్టలు లభ్యమైన నేపథ్యంలో దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. జడ్జిల ఆస్తుల వివరాలు ప్రజలకు తెలిసేలా కోర్టు వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. మొత్తం 33 మంది జడ్జిల అంగీకారంతో కీలక నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ సంస్కరణ సుప్రీంకోర్టుకు భవిష్యత్‌లో వచ్చే జడ్జిలకూ వర్తిస్తుందని వెల్లడించింది.

సంబంధిత పోస్ట్