ఆదివారం తెల్లవారుజామున భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు మెట్టులో రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బీబీనగర్ సీఐ ప్రకారం..జనగామ -హైదరాబాద్ వెళ్తున్న వీరి కారును కొండమడుగు సమీపంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. మేడ్చల్ జిల్లా మేడిపల్లికి చెందిన షేక్ అవైస్(24) మృతిచెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసుల కేసు నమోదు చేశారు.