సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ లో త్వరలో జరగనున్న పట్టభద్రులు ఎన్నికల్లో భాగంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని హుజుర్ నగర్ ఆర్డీవో కార్యాలయంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో హుజుర్ నగర్ ఆర్డిఓ జగదీశ్వర్ రెడ్డి గురువారం తెలిపారు. 2020 నవంబర్ 1 తేదీకి డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అర్హులేనని అన్నారు. గతంలో ఓటు వేసిన వారు కూడా మళ్లీ కొత్తగా అప్లై చేసుకోవాలని తెలిపారు.