వీధి కుక్క దాడిలో చిన్నారికి గాయాలు

10821చూసినవారు
వీధి కుక్క దాడిలో చిన్నారికి గాయాలు
కోదాడ మున్సిపల్ పరిధిలోని తిలక్ నగర్ లో వీధి కుక్క దాడి చేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రసూల్, ఆయేషా దంపతుల మూడేళ్ల చిన్నారి రబియా ఆడుకోవడానికి వీధిలోకి వచ్చింది. వీధిలో తిరుగుతున్న కుక్క చిన్నారిపై దాడి చేసి గాయపరుస్తుండగా అక్కడే ఉన్న బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు మంగతాయారు, సర్వేశ్వరరావు లు గమనించి కుక్కను తరమడంతో ప్రాణ గండం తప్పింది.

సంబంధిత పోస్ట్