నడిగూడెంమండల కేంద్రంలో గల శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఆదివారం గురుపూర్ణిమ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం కాగడ హారతితో కార్యక్రమాలు ప్రారంభించి అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలోతెలుగు ఉపన్యాసకులు రామచంద్రయ్య , విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు దోరేపల్లి శ్రీనివాసరావు , ఆలయ అర్చకులు రాజశేఖర్ శర్మ , సాయి సేవా సమితి అధ్యక్షులు మండవ వెంకటేశ్వరరావు, కార్యదర్శి అనంతుల కృష్ణయ్య ఉన్నారు.