కోదాడ: వ్యవసాయ బావిలో పడి విద్యార్థి మృతి

59చూసినవారు
అనంతగిరి మండలం శాంతినగర్ ఎస్సీ హాస్టల్లో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. ఆదివారం సెలవు కావడంతో విద్యార్థుల హాస్టల్ లోనే ఉండి ట్యూటర్ పర్యవేక్షణలో చదువుకుంటుంటారు. కాగా విద్యార్థులు ట్యూటర్ తో కలిసి వ్యవసాయ బావుల వద్దకు ఈతకు వెళ్లారు. వీరిలో మొదట ట్యూటర్ బావిలోకి దూకగా అతని వెంట మరో విద్యార్థి కూడా బావిలోకి దూకాడు ట్యూటర్ ఈదుకుంటూ బయటికి రాగా ట్యూటర్ తో పాటు దూకిన విద్యార్థి బావిలో మునిగిపోయాడు. ట్యూటర్ బావిలో ఎంత గాలించినా దొరకకపోవడంతో అక్కడినుండి ట్యూటర్ పరారయ్యాడు మిగతా విద్యార్థులు సమాచారాన్ని గ్రామంలోకి చేర్చడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున వ్యవసాయ భావి వద్ద కు. బావిలో మునిగిపోయిన విద్యార్థి శవాన్ని బయటికి తీశారు. హాస్టల్ వార్డెన్ ట్యూటర్ నిర్లక్ష్యం పట్ల స్థానికులు మండిపడుతున్నారు పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్