ఎలక్ట్రానిక్ పరికరాలలో పిసిబి ప్రింట్ సర్క్యూట్ బోర్డ్ వెన్నుముక లాంటిదని ఇన్నావేటర్ కంపెనీ సీనియర్ ప్రాసెస్ ఇంజనీర్ సాదు సాయి సందీప్ అన్నారు. సోమవారం కోదాడ కిట్స్ లో బీటెక్ తృతీయ సంవత్సరం ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ఇంజనీరింగ్ విభాగం విద్యార్థులకు నిర్వహించిన పిసిబి డిజైన్ అండ్ ఫ్యాబ్రికేషన్అనే అంశంపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ డా. నాగార్జున రావు, ప్రిన్సిపాల్ డా. గాంధీ, హెచ్ ఓడీ లు ఉన్నారు.