తమ్మరబండపాలెం గ్రామాన్ని కోదాడ మున్సిపాలిటీ లో విలీనం చెయ్యాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి

544చూసినవారు
సూర్యాపేట జిల్లా: యాంకర్: తమ గ్రామాన్ని కోదాడ మున్సిపాలిటీ లో విలీనం చెయ్యాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలంటూ సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమ్మరబండపాలెం గ్రామానికి చెందిన ఉపాధి హామీ కూలీలు రోడ్డుపై ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.దీంతో ఖమ్మం కోదాడ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి పొయ్యాయి. కోదాడ మున్సిపాలిటీలో మా గ్రామాన్ని కలిపితే దాదాపు 250 కుటుంబాల పొట్ట కొట్టినవారవుతారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు,ప్రభుత్వం తమ నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని గ్రామస్తులు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్