చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్

55చూసినవారు
చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్
గొలుసు చోరీకి పాల్పడిన కేసులో నల్గొండ జిల్లాకు చెందిన ముగ్గురు నిందితులను హయత్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. బ్రాహ్మణపల్లికి చెందిన జెల్లా లక్ష్మమ్మ (60) ఈ నెల 17న హయత్ నగర్ పరిధిలోని శాంతినగర్ సంతలో కూరగాయలు విక్రయించి ఇంటికి వెళ్తుండగా.. రత్న తేజ నాయక్, కుర్ర తుల్చనాయక్, రమావత్ వంశీ నాయక్ ఆమె మెడలోని బంగారు చైన్ తెంపుకుని పరారయ్యారు. నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్