హత్య కేసులో ముగ్గురు నేరస్తులకు జీవిత ఖైదు విధిస్తూ స్పెషల్ సెషన్స్ ఎస్సీ, ఎస్టీ నల్గొండ జిల్లా కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. చిలుకూరు మండలం కట్ట కొమ్ముగూడెంలో 2019 మార్చి 15న దళితుడైన గోపిని అదే గ్రామానికి చెందిన దస్తగిరి అనే వ్యక్తి వెంకటరత్నం, రేణుక సహకారంతో ట్రాక్టర్ తో ఢీకొట్టి హత్య చేశారు. దస్తగిరి, వెంకటరత్నం, రేణుక నేరానికి పాల్పడ్డరని నిర్ధారించి జీవితఖైదు విధించారని ఎస్పీ నరసింహ తెలిపారు.