సూర్యాపేట పట్టణంలోని స్థానిక 9వ వార్డులోని అంగన్వాడి కేంద్రాలలో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మంగళవారం అమ్మ మాట-అంగన్వాడి బాట కార్యక్రమం నిర్వహించారు. ర్యాలీలో సూర్యాపేట మున్సిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్ పాల్గొన్నారు. అంగన్వాడి టీచర్లు వార్డులలోని ఇంటింటికి వెళ్లి రెండు సంవత్సరాలు దాటిన చిన్న పిల్లలను మొదటి గా అంగన్వాడి స్కూలుకు పంపమని తల్లిదండ్రులకు అవేర్‌నెస్ కలిగించాలని కోరారు.