ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించిన జగదీష్ రెడ్డి సతీమణి

52చూసినవారు
సూర్యాపేట మున్సిపాలిటీ స్థానిక 39వ వార్డులో ఆదివారం సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సతీమణి సునీత ముమ్మర ప్రచారం నిర్వహించారు. బీ. ఆర్. ఎస్ పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గెలుపు కోసం గడపగడపకు కరపత్రాలు అందజేసి కారు గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ అన్నపూర్ణమ్మ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్