సూర్యాపేట పబ్లిక్ క్లబ్ లో ఆదివారం ఎస్ఎస్ స్పోర్ట్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన షటిల్ టోర్నమెంట్ కార్యక్రమానికి మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ ఇన్ ఛార్జ్ రాంరెడ్డి దామోదర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని, పబ్లిక్ క్లబ్ ను ఫ్యామిలీ క్లబ్ గా మార్చి అభివృద్ధికి సహకరిస్తానని, పబ్లిక్ క్లబ్ లో ఎలాంటి రాజకీయాలకు తావు లేదని తెలియజేశారు.