యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం పొడిచేడు గ్రామంలో శ్రీకాంత చారి 15వ వర్ధంతి కార్యక్రమాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత చారి విగ్రహానికి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పూలమల్ల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన శ్రీకాంత్ చారి అమరుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మోత్కూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.