సీపీఎం యాదాద్రి భువనగిరి జిల్లా 3వ మహాసభలు ఈ నెల 15, 16, 17 తేదీలలో చౌటుప్పల్ పట్టణంలో నిర్వహిస్తున్నామని, ఈ బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం మోత్కూర్ మండలం పాటిమట్ల గ్రామంలో మహాసభలకు సంబందించిన కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.