ప్రభుత్వ పాఠశాలలో సంక్షేమ హాస్టల్స్ గురుకులాలలో ఫుడ్ పాయిజన్, వరుస ఘటనలపై ప్రభుత్వ మొండి వైఖరిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల బంద్ సందర్భంగా శనివారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలోని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో పాఠశాలలు బంద్ నిర్వహించారు. మండల నాయకులు ఉప్పుల మణికుమార్, మాట్లాడుతూ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం పరిపాలన లోపం అన్నారు.