సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో పీర్ల సందడి అత్యంత వైభవంగా శనివారం మొదలైంది. చౌరస్తాలో తల్లి పీరమ్మతో వివిధ షాపులు తిరుగుతూ భక్తులతో కానుకలు హారతులు సమర్పించుకున్నారు. ఈ నెల 29వ తేదీ వరకు మొహరం ఉత్సవాలను నిర్వహిస్తామని ముజవారి వజ్రల్లి తెలిపారు. ఈ కార్యక్రమంలో మారెల్లి శ్రీను, సాయి, భూపతి లింగన్న, గణేష్, తదితరులు పాల్గొన్నారు.