తుంగతుర్తికి చెందిన మలిదశ ఉద్యమకారుడు ఓరుగంటి సత్యనారాయణ చిత్రపటానికి తెలంగాణ ఉద్యమకారుడు కృష్ణయ్య ఘనంగా నివాళులర్పించారు. ఇటీవల మలిదశ ఉద్యమకారుడు రిటైర్డ్ ఉద్యోగి, ఓరుగంటి సత్యనారాయణ అనారోగ్యంతో మరణించారు. బుధవారం వారి నివాసానికి చేరుకుని వారి చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించి కుటుంబాన్ని పరామర్శించారు. నికార్సైన తెలంగాణ ఉద్యమ నాయకునిగా ఓరుగంటి సత్యనారాయణ పేరు ప్రఖ్యాతలు పొందారు.