సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివిరాల గ్రామంలో బుధవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో ఒకసారిగా భూకంపం సంభవించింది. మూడు సెకండ్ల పాటు ఒక్కసారిగా భూమి కనిపించడంతో ఇండ్ల నుండి ప్రజలు బయటకు వచ్చారు. భూమి కంపించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. గ్రామానికి చెందిన వెలుగు సుధాకర్ ఇంట్లో భూకంపం సంభవించిందని తెలియజేశారు. ఇంట్లో ఉండగా ఒక్కసారిగా కనిపించడంతో బయటికి వచ్చి పరుగులు తీసారని తెలిపారు.