సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిధర్ రెడ్డి, వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, నూతనకల్ మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అశోక్, తుంగతుర్తి మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ బొంకూరి రంజిత్, బొంకూరి జలంధర్ లను డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు శుక్రవారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో కిషన్ రావు, మండల పార్టీ అధ్యక్షుడు దొంగలు గోవర్ధన్, తుంగతుర్తి గ్రామ శాఖ అధ్యక్షులు రాంబాబు పాల్గొన్నారు.