సూర్యాపేట జిల్లా తుంగతుర్తి వ్యవసాయ మార్కెట్ ను మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానని మార్కెట్ చైర్మన్ గా ఎన్నికైన తీగల గిరిధర్ రెడ్డి అన్నారు. బుధవారం తుంగతుర్తిలో వారు మాట్లాడుతూ ఈనెల 7న ప్రమాణస్వీకారం ఉంటుందని, తుంగతుర్తి, మద్దిరాల, నూతనకల్ మండలాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్య క్రమానికి ఎమ్మెల్యే సామేలు హాజరవుతారని తెలిపారు.