సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో రైతు వేదికలో మంగళవారం రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రైతుల కొరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. యాసంగి వరి - నారుమడి యాజమాన్యం పద్ధతులపై వ్యవసాయ అధికారుల నుంచి సూచనలు సలహాలు వివరించారు.