కేటీఆర్ ఏసీబీ కేసులో కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని టీపీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. మంగళవారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ. అవినీతి జరిగిన దగ్గర అసలు విచారణ వద్దు అని కేటీఆర్ కోర్టుకుపోవడం అప్రజా స్వామీకం అని కోర్టు చెప్పడం దీనికి ఒక ఉదాహరణ అన్నారు. కేటీఆర్ దొంగతనం చేసిన తర్వాత దొంగతనం కాదు అని శతవిధాల కేటీఆర్ ప్రయత్నిస్తుండడం మనం గమనించాలి అని అన్నారు.