ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా స్వియాటెక్

60చూసినవారు
ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా స్వియాటెక్
పోలండ్‌కు చెందిన ప్రపంచ నంబర్ 1 టెన్నిస్ ర్యాంకర్ స్వియాటెక్‌ ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్‌లో ఇటలీకి చెందిన జాస్మిన్ పవోలీనిని ఓడించింది. 6-2, 6-1 తేడాతో వరుస సెట్లలో ప్రత్యర్థిని చిత్తు చేసింది. తద్వారా ఓపెన్ ఎరాలో మహిళల విభాగంలో వరుసగా మూడు ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్స్ సాధించిన మహిళగా ఆమె నిలిచింది. మొత్తంగా ఆమె ఖాతాలో 4 ఫ్రెంచ్ ఓపెన్, ఒక యూఎస్ ఓపెన్ టైటిల్స్ ఉన్నాయి.

సంబంధిత పోస్ట్