బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్ ఓవల్‌లో జరుగుతున్న డే-నైట్ టెస్ట్ సిరీస్‌లో టీమిండియా కష్టాల్లో పడింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ విరాట్ కోహ్లీ (11) విఫలమయ్యాడు. స్కాట్ బోలాండ్ వేసిన 14.3 ఓవర్‌కు వికెట్‌కీపర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ 7 పరుగులకే ఔటైన సంగతి తెలిసిందే. 15 ఓవర్లకు స్కోరు 73/3. రిషభ్ పంత్ (6), గిల్ (20) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోర్ 86/3.