చిరుతతో సెల్ఫీ తీసుకున్న యువకుడు (వీడియో)

563చూసినవారు
మనం ఉండే ప్రాంతంలోకి సినీనటులు, రాజకీయ నాయకులు వస్తే వారి వద్దకు వెళ్లి సెల్ఫీలు తీసుకుంటాం. అయితే ఓ యువకుడు తన పొలంలోకి దూసుకొచ్చిన చిరుతతో సెల్ఫీ తీసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఘటన ఉత్తర భారత్‌లో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. చిరుత కనపడిందంటే చాలు పరుగులు తీస్తారు. ఈ యువకుడు మాత్రం దర్జాగా దాని వద్దకు నడుచుకుంటూ వెళ్లి సెల్ఫీ తీసుకున్నాడు. ఆ చిరుత కూడా అతడిపై దాడి చేయకపోవడం మరింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్