కేసీఆర్ పాలనలో పురోగమించిన తెలంగాణ.. అనుభవరాహిత్యం, అవినీతి కలగలసిన రేవంత్ పాలనలో అన్ని రంగాల్లో తిరోగమిస్తోందని కేటీఆర్ 'X' వేదికగా మండిపడ్డారు. 'రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు బాగుంటే బైకులు, కార్లే కాక ఇతర భారీ వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లు వృద్ధిని చూపిస్తాయి. కానీ TGలో రిజిస్ట్రేషన్లు తగ్గి, ఆదాయం తిరోగమనంలో ఉంది. పాలన వదిలేసి కక్షసాధింపు చర్యలకే పూర్తి సమయం కేటాయిస్తే ఫలితాలు ఇలా కాక మరెలా ఉంటాయి?' అని ఎద్దేవా చేశారు.