దేశ ఆర్థిక సంస్కరణల ఆర్కిటెక్ట్‌గా మన్మోహన్ సింగ్ దేశానికి అమోఘమైన సేవలందించారని మాజీ కేసీఆర్ కొనియాడారు. తెలంగాణకు ప్రత్యేకమైన అనుబంధం మన్మోహన్ సింగ్ గారితో ఉంది. వారి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన నాకు వారితో వ్యక్తిగత అనుబంధముంది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి రాష్ట్ర ఏర్పాటు దాకా వారందించిన సహకారం తెలంగాణ సమాజం మరువదు. వారు ప్రధానిగా ఉన్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది' అని పేర్కొన్నారు.