ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత (వీడియో)

55చూసినవారు
ఉస్మానియా యూనివర్సిటీలో డీఎస్సీ వాయిదా వేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అభ్యర్థులను వెంటాడి మరీ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. మేము ఉగ్రవాదులం కాదు..తెలంగాణ నిరుద్యోగులం..ప్రజాపాలన లో మోసపోతున్న బిడ్డలం.. అంటూ అభ్యర్థులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఈ అరెస్టుల నేపథ్యంలో ఓయూ లోపల పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్