'టెన్త్' పేపర్ లీకేజీ ఘటన.. KTRపై కేసు నమోదు

65చూసినవారు
'టెన్త్' పేపర్ లీకేజీ ఘటన.. KTRపై కేసు నమోదు
TG: నల్గొండ జిల్లా నకిరేకల్‌లో పోలీస్ స్టేషన్‌లో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదైంది. నకిరేకల్‌లో పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో తమపై తప్పుడు ఆరోపణలు చేశారని నకిరేకల్ మున్సిపల్ ఛైర్ పర్సన్ రజిత కేటీఆర్‌పై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేటీఆర్‌పై FIR నమోదు చేశారు. కాగా లీకేజీ ఘటనలో పోలీసులు ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.

సంబంధిత పోస్ట్