ఏపీలో రేపటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు శుభవార్త చెప్పారు. విద్యార్థులంతా చక్కగా పరీక్షలు రాయాలని, మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇన్నాళ్లు మీరు చదివిన కష్టం ఫలితాల రూపంలో వచ్చే పరీక్ష సమయం ఇదన్నారు. ప్రశాంతంగా ఉండండి.. సమయాన్ని సద్వినియోగం చేసుకొని సకాలంలో పరీక్ష పూర్తి చేయాలని లోకేశ్ సూచించారు