ఎలన్ మస్క్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ టెస్లా త్వరలోనే భారత్‌లో ప్రవేశించనుంది. ఇటీవల కేంద్రం ఎలన్ మస్క్ అభ్యర్థన మేరకు దిగుమతి సుంకాన్ని 20 శాతం కంటే తక్కువకు తగ్గించింది. ఈ క్రమంలో ఒక్క టెస్లా కారుపై ఎంత ట్యాక్స్ పడుతుందో అని పలువురు చర్చించుకుంటున్నారు. అయితే ప్రముఖ గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ సంస్థ CLSA నివేదిక ప్రకారం..ఒక్క కారుపై దాదాపు రూ.15 లక్షలు ట్యాక్స్ పడనుందని సమాచారం.