TG: దారుణం.. వృద్ధురాలిపై లైంగిక దాడి

79చూసినవారు
TG: దారుణం.. వృద్ధురాలిపై లైంగిక దాడి
నల్గొండ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామానికి చెందిన కేతపల్లి బాలమ్మ(80)పై తన అల్లుడైన బాల రామ్(47) మంగళవారం రాత్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె సహకరించక పోగా, వృద్ధురాలిని చితకబాది అక్కడినుండి పారిపోయాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు వృద్ధురాలిని దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వృద్ధురాలి పరిస్థితి నిలకడగా ఉంది.

సంబంధిత పోస్ట్