TG: గురుకుల విద్యార్థులకు శుభవార్త.. మెనూలో మటన్!

64చూసినవారు
TG: గురుకుల విద్యార్థులకు శుభవార్త.. మెనూలో మటన్!
తెలంగాణలో హాస్టల్ విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటివరకు ప్రభుత్వ హాస్టళ్లలో ప్రతీ ఆదివారం చికెన్ పెడుతున్నారు. తొలిసారిగా విద్యార్థులకు మటన్ పెట్టబోతున్నారు. ఇకపై లంచ్‌లో నెలలో 2 సార్లు మటన్, 4 సార్లు చికెన్ పెట్టనున్నారు. నాన్‌వెజ్ భోజనం పెట్టినప్పుడు సాంబార్, పెరుగు ఉంటుంది. నాన్‌వెజ్ తినని వారికి మిల్‌మేకర్ కర్రీ పెడతారు. నాన్‌వెజ్ లేని రోజుల్లో లంచ్‌లో ఉడికించిన గుడ్డు/ఫ్రైడ్ ఎగ్ ఇస్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్