అనుమానాస్పద స్థితిలో నటుడు మృతి

79చూసినవారు
అనుమానాస్పద స్థితిలో నటుడు మృతి
తమిళ నటుడు ప్రదీప్ కె. విజయన్ కన్నుమూశారు. గత రెండు రోజులుగా ఇల్లు తెరవకపోవడంతో అతని స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా శవమై కనిపించాడు. పోలీసులు అతని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రదీప్ అనుమానాస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ప్రదీప్ పలు తెలుగు చిత్రాల్లో కూడా నటించారు.

సంబంధిత పోస్ట్