తమిళనాడులో ప్రమాదం తప్పింది. ఓ బాలుడు జేసీబీని డ్రైవ్ చేశాడు. ఈ క్రమంలో అతడు అదుపుతప్పి రోడ్డు పక్కన పార్క్ చేసిన ఆటోలు, కార్లను ఢీకొట్టగా అవి ధ్వంసం అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రమాద దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ ఫుటేజీలో నమోదు అయ్యాయి.