బైక్‌ను ఢీకొట్టిన కారు.. 10 అడుగులు గాల్లోకి ఎగిరి కింద పడ్డారు (వీడియో)

83చూసినవారు
కర్ణాటకలోని బీదర్ జిల్లా నిర్నా క్రాస్ వద్ద ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. ముంబై-హైదరాబాద్ హైవేపై ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తుండగా ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. బైక్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అమాంతం 10 అడుగులు గాల్లోకి ఎగిరి కింద పడ్డారు. క్షతగాత్రులను పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్