రోడ్డుపై పడిన చెట్టు.. తప్పించుకున్న డెలివరీ బాయ్‌ (VIDEO)

55చూసినవారు
ముంబైలో శనివారం రాత్రి షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. విరార్ ప్రాంతంలోని అగాషి చల్‌పేత్ సమీపంలో ఆకస్మాత్తుగా ఓ భారీ చెట్టు కూలింది. ఆ సమయంలో ఒక డెలివరీ బాయ్ స్కూటర్‌పై ఆ రోడ్డులో వెళ్తుండగా.. చెట్టు నేరుగా ఆ స్కూటర్‌పై పడింది. అయితే డెలివరీ బాయ్‌ తృటిలో తప్పించుకున్నాడు. అదృష్టవశాత్తు స్వల్ప గాయాలో బటయపడ్డాడు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

సంబంధిత పోస్ట్