ఉత్తరప్రదేశ్‌లో శనివారం షాకింగ్ ఘటన జరిగింది. ఓ తండ్రి ఆసుపత్రిలో బిల్లు కట్టేందుకు మూడేళ్ళ చిన్నారిని అమ్మేశాడు. తన భార్య ఆసుపత్రిలో ఆరో బిడ్డకు జన్మనివ్వగా.. బిల్లు కడితేనే యాజమాన్యం ఇంటికి పంపిస్తామని చెప్పింది. దీంతో తన మూడేళ్ళ కొడుకుని అఅమ్ముకున్నాడు. ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఈ కేసులో ఐదుగురిని అదుపులోకి తీసుకుని.. చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు.