పాక్ జట్టుపై మాజీ కెప్టెన్ తీవ్ర విమర్శలు

79చూసినవారు
పాక్ జట్టుపై మాజీ కెప్టెన్ తీవ్ర విమర్శలు
యూఎస్‌ఏ చేతిలో పాకిస్థాన్‌ ఓటమి చెందడంతో ఆ జట్టుపై మాజీ క్రికెటర్లు విమర్శలు ఎక్కుపెట్టారు. తాజాగా పాక్‌ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ మాట్లాడుతూ ‘‘యూఎస్‌ఏకు పాక్‌ ఎలా వెళ్లిందో అర్థంకావడం లేదు. బాడీ లాంగ్వేజ్‌ కూడా దారుణంగా ఉంది. ఎవరిలోనూ గెలవాలనే ఆకాంక్ష కనిపించలేదు. వీళ్లను చూస్తుంటే మేం చాలా ఏళ్లుగా క్రికెట్‌ ఆడటం లేదేమో అనిపించింది. షహీన్‌కు యార్కర్‌ వేయడం తెలిసినట్లుంది. బంతి స్వింగ్‌ కాకపోతే అతడి ప్రభావం శూన్యం’’ అని భట్ తెలిపాడు.

సంబంధిత పోస్ట్