ప్రతి పేదవాడికి ప్రభుత్వం అండగా ఉంటుంది: దామోదర

50చూసినవారు
ప్రతి పేదవాడికి ప్రభుత్వం అండగా ఉంటుంది: దామోదర
ప్రతి పేదవాడికి ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు. సంగారెడ్డి (D) నేరడిగుంట గ్రామసభలో మంత్రి హాజరై మాట్లాడారు. అర్హత ఉన్న వారికి ఇళ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సహాయం తప్పక అందుతుందన్నారు. రైతు రుణమాఫీ త్వరలో పూర్తవుతుందన్నారు. జనవరి 26 నుంచి రైతు భరోసా పంపిణీ జరుగనుందన్నారు. వితంతు, వృద్ధాప్య, వికలాంగుల పించన్ ఇంకా రావాల్సిన వారికి ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్