కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు పలు కీలక సూచనలు చేసింది. సమ్మక్క జాతరతో పాటుగా వారాంతపు సంతల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అలాగే ఈనెల 31 నుంచి పాఠశాలలను తెరుస్తారా అని హైకోర్టు ఆరా తీసింది. అయితే పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. స్కూళ్ల ప్రారంభంపై వివరాలు తెలపాలని ధర్మాసనం ఆదేశించింది.