గ్రామసభల్లో చదివే జాబితా తుది జాబితా కాదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఖమ్మం (D) తిరుమలాయపాలెం మండల పర్యటనలో ఆయన మాట్లాడారు. 'జాబితాలో ఉంటే ఉన్నట్లు.. లేకపోతే రానట్లు కాదు. అర్హత ఉండి పేరు రాకపోతే మళ్ళీ దరఖాస్తు చేయండి. వాటి ఆధారంగానే ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తాం. పేదవాళ్లలో బహు పేద వాళ్ళకి మొదటి ప్రాధాన్యత. ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్షం ఓర్వలేక పోతుంది' అని విమర్శించారు.