2036 నాటికి భారత్‎లో పెరగనున్న మహిళల సంఖ్య!

64చూసినవారు
2036 నాటికి భారత్‎లో పెరగనున్న మహిళల సంఖ్య!
గణాంకాలు, పథకాల అమలు మంత్రిత్వ శాఖ 'ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2023' పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. భారతదేశంలో లింగ నిష్పత్తి 2036 నాటికి ప్రతి 1000 మంది పురుషులకు 952 మంది మహిళలకు మెరుగుపడుతుందని ఈ నివేదికలో పేర్కొంది. 2011లో 48.5 శాతంగా ఉన్న మహిళల శాతం 2036 నాటికి 48.8 శాతానికి చేరుకుంటుందని నివేదిక పేర్కొంది. సంతానోత్పత్తి క్షీణించడం వల్ల 15 ఏళ్లలోపు వ్యక్తుల నిష్పత్తి తగ్గుతుందని అంచనా వేసింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్