యూట్యూబ్‌ను షేక్ చేసిన ఒకే ఒక్క ఇండియన్ సాంగ్ ‘కుర్చీ మడతపెట్టి’. ఈ ఏడాది ఎన్నో పాటలు విడుదలైనా వాటి అన్నింటి కంటే ‘గుంటూరు కారం’ మూవీలోని ఈ పాట సంచలనాలు సృష్టిస్తోంది. 527 మిలియన్స్ వ్యూస్ రాబట్టి టాప్‌లో నిలవడంపై సంగీత దర్శకుడు తమన్, నటి శ్రీలీల ఆనందం వ్యక్తం చేశారు. ‘గుంటూరు కారం’ టీమ్ అందరి సహకారంతోనే ఇది సాధ్యమైందని వారు అన్నారు. దీనిపై తెలుగు సినీ ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.