రూ.10 ఇవ్వలేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన పాన్ షాప్ ఓనర్!

54చూసినవారు
రూ.10 ఇవ్వలేదని పోలీసులకు ఫిర్యాదు చేసిన పాన్ షాప్ ఓనర్!
యూపీలోని హర్దోయ్ ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. రూ.10 బాకీ పడిన మనిషి ఆ మొత్తాన్ని ఇవ్వడం లేదని ఓ వ్యక్తి పోలీసుల్ని ఆశ్రయించాడు. జితేంద్ర అనే వ్యక్తి పాన్ షాప్ నడుపుతున్నాడు. సంజయ్ అనే వినియోగదారుడు ఏడాదిన్నర క్రితం గుట్కా ప్యాకెట్ కొనుగోలు చేసి రూ.10 అప్పుగా తీసుకున్నాడు. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోవడంతో విసిగిపోయిన జితేంద్ర.. పోలీస్ హెల్ప్ లైన్ 112కు ఫోన్ చేశాడు. పోలీసులు వచ్చి సంజయ్ నుంచి రూ.10ని జితేంద్రకి ఇప్పించారు.

సంబంధిత పోస్ట్