తెలంగాణ ఉద్యమం అయి పోలేదు.. ఇంకా ఉంది: కేసీఆర్

66చూసినవారు
తెలంగాణ ఉద్యమం అయి పోలేదు.. ఇంకా ఉంది: కేసీఆర్
తెలంగాణలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చినా BRS ప్రభుత్వమే వస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ అన్నారు. కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌కు మద్దతుగా వీణవంకలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ ప్రసంగించారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తాత్కాలికమే. గెలిస్తేనే లెక్క అనుకోవద్దు. గెలిచినా, ఓడినా ప్రజల కోసం పనిచేస్తూనే ఉండాలి. తెలంగాణ ఉద్యమం అయి పోలేదు.. ఇంకా ఉంది. తెలంగాణ పునర్నిర్మాణ ప్రక్రియ ముందుకు సాగాల్సిన అవసరముంది' అని అన్నారు.

సంబంధిత పోస్ట్