మరో రెండు గ్యారెంటీల అమలుకు ముహూర్తం ఫిక్స్!

78చూసినవారు
మరో రెండు గ్యారెంటీల అమలుకు ముహూర్తం ఫిక్స్!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో రెండు గ్యారెంటీలను ఫిబ్రవరి మొదటివారంలో అమలు చేయాలని భావిస్తోంది. రూ.500కు వంట గ్యాస్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్‌ ను అమలు చేయనున్నట్లు సమాచారం. ఈ రెండు గ్యారెంటీలను అమలు చేసేందుకు సన్నద్ధం కావాలని సీఎం రేవంత్ ఇప్పటికే ఆయా శాఖలకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. మహాలక్ష్మి గ్యారెంటీలో ఒకటైన రూ.500లకే గ్యాస్ సిలిండర్‌, గృహజ్యోతిలోని ప్రతి కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ను ఇవ్వనున్నారు.

సంబంధిత పోస్ట్