గడువును పొడిగించే ప్రసక్తే లేదు: ఎస్ఎస్​సీ

59చూసినవారు
గడువును పొడిగించే ప్రసక్తే లేదు: ఎస్ఎస్​సీ
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో జూనియర్ ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఓ అలర్ట్ జారీచేసింది. మొత్తం 968 పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువు ఏప్రిల్ 18తో ముగియనున్నందున.. త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఏ కారణంతోనైనా అప్లికేషన్ల స్వీకరణ గడువును ఎట్టిపరిస్థితుల్లో పొడిగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.

సంబంధిత పోస్ట్