లారీ బీభత్సం.. బైక్ ను ఢీకొట్టి ఈడ్చుకెళ్లింది(వీడియో)

572చూసినవారు
హైదరాబాద్ లో ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఐఎస్ సదన్ పరిధిలో ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టి చాలా దూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒవైసీ హాస్పిటల్ నుంచి ఎల్బీనగర్ మార్గంలో వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. లారీ డ్రైవర్ పరారయ్యేందుకు ప్రయత్నించి, బైకును ఈడ్చుకెళ్లాడు. బైక్ పై వ్యక్తి లారీ డోర్ పట్టుకొని ఉండగా లారీ డ్రైవర్ ఆపకుండా కొన్ని కి.మీ. దూరం అలాగే తీసుకెళ్ళాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్